రోడ్డు పక్కన ప్రమాదకరమైన బావులకు రక్షణ గోడలు నిర్మించాలి

రోడ్డు పక్కన ప్రమాదకరమైన బావులకు రక్షణ గోడలు నిర్మించాలి
కొత్తపల్లి యువతరం విలేఖరి;
రోడ్డు పక్కన ప్రమాదకరమైన బావులకు రక్షణ గోడలు నిర్మించాలి: ప్రజాసంఘాలు ఆత్మకూరు నుండి సంగమేశ్వరం వరకు రోడ్డు ప్రక్కన ఉన్న వ్యవసాయ బావులు ప్రయాణికుల వాహనాలకు ప్రమాదకరంగా ఉన్నాయి ఆర్ అండ్ బి అధికారులు చర్యలు తీసుకొని ఈ బావులకు రక్షణ గోడలు నిర్మించి ప్రయాణికులకు భద్రత కల్పించాలని ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు బొల్లు ప్రసాద్ బాబు యాదవ్ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు డిమాండ్ చేశారు శనివారం నాడు ప్రమాదకరమైన బావులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూరు నుండి సంగమేశ్వరం వరకు ఉన్న ఆర్ అండ్ బి రోడ్డుకు ఇరువైపులా లింగాపురం శివపురం సింగరాజుపల్లి గుమ్మడ పురం ముసలమడుగు తదితర గ్రామాల్లో రోడ్డును ఆనుకునే వ్యవసాయ బావులు ఉన్నాయి నిత్యం ఈ రోడ్డుపైన వందలాది వాహనాలు తిరుగుతున్నాయి వేల మంది ప్రయాణికులు ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తున్నారు వాహన చోదకులు ఏ మాత్రం ఏమరపాటుకు గురైన తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ రోడ్డు మృత్యు మార్గంగా మారక ముందే ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు పక్కన ఉన్న బావులకు రక్షణ గోడలు నిర్మించి ప్రయాణికులకు వాహన చోదకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఇంద్రకర్( నాని), రాము, దేవ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.