POLITICSTELANGANA

ఎమ్మెల్యే రేగా ఎలక్షన్లో హామీలు ప్రజలకు నెరవేరిస్తే నేను ముక్కుని నేలకు రాస్తా

ఎమ్మెల్యే రేగా..! ఎలక్షన్లో హామీలు ప్రజలకు నెరవేరిస్తే నేను ముక్కు నేలకు రాస్తా.

భూ రైతుల కోసం న్యాయ పోరాటం చేస్తుంటే…! ఎమ్మెల్యే తప్పుడు పిడియాక్ట్ లకు భయపడం.

పినపాక నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ అల్లెం కోటి సవాల్

భద్రాద్రి యువతరం ప్రతినిధి.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కొమరం భీమ్ ఆశయ సాధన కోసం జల్ జంగిల్ జమీన్, నీళ్లు, నిధులు, నియమాకాలు, నినాదంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తా ఉంటే, ఎమ్మెల్యే రేగా కాంతారావు గిరిజన నాయకుల పై అక్రమ పిడియాక్ట్ కేసులు పెట్టి చర్లపల్లి జైల్లో చట్టాల దురునియోగం తో నిర్బంధిస్తున్నారు. ప్రజల కోసం పనిచేస్తా ఉంటే ఇంతకంటే పెద్ద కేసులు పెట్టేది ఉంటే రహస్యంగా కాదు బహిరంగంగా చెప్పి పెట్టు వాటికి భయపడం ఎదుర్కొంటాం.
గిరిజన రిజర్వేషన్ మీద పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలిచిన అనంతరం గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన చట్టాలు నీ నియోజకవర్గంలో పిసా చట్టం, వన్ బై సెవెంటీ (1/70),1/59,1/63,1/77 (pot), ఆదివాసి జీవో లను వగైరా వాటిని అధికార ఉత్తర్వులు, మొబైల్ కోర్ట్ ఆడర్లు, న్యాయస్థానాల ఆడర్లు కాలరాశారు. ఎమ్మెల్యే అనుచరులు, భూకబ్జాలు, రియల్ ఎస్టేట్, ఇసుక దందా వ్యాపారాలు, మైనింగ్ మాఫియా, అక్రమ మద్యం సిండికేట్ వ్యవహారం, అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పైరవీలు చేస్తూ అధికార దుర్వినియోగంకు పాల్పడ్డారు. మీ అనుచరుల పై పి డి యాక్ట్ కేసులు పెట్టరా, ఎమ్మెల్యేగా ఆ ధైర్యం మీకు ఉందా ? ప్రశ్నించే గొంతుకుల మీద పోలీస్ స్టేషన్లో కొంతమంది అనుచర వ్యక్తులతో కంప్లీట్ పెట్టిచ్చి, మీడియా మిత్రుల మీద, ప్రజల మీద, భూ నిర్వాసితుల మీద, గిరిజన సంఘం నాయకుల మీద, ఎస్సీ , బిసి, మైనార్టీ వర్గాల మీద వగైరా వ్యక్తుల మీద మీ డేటా ఇంటిలిజెన్సీ ద్వారా నా వద్ద ఉన్నది. నా మాట వినకపోతే కేసులు పెడతామని బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి, అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒక దారుణమైన పరిపాల చేస్తున్నారు.
బి టి పి ఎస్, రైల్వే లైన్ నిర్వహితులకు న్యాయం జరగాలి వారికి సహకరిస్తాం. కానీ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. దానిలో ప్రజా ప్రతినిధులు చట్టాలు ఉల్లంఘించి, లక్షలాది రూపాయలు చేతులు మారిన తర్వాత ఆదివాసి రైతుల అసైన్మెంట్ పట్టా భూములను బలవంతంగా గుంజుకున్నారు. వాటికోసం పోరాడితే ఆదివాసీల మీద తప్పుడు కేసులు, ఇదేనా మీ పరిపాలన విధానమా.. ఇందుకోసమేనా నీళ్లు, నియామకాలు, నిధులు ఒక నినాదంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు అర్థం. ఈరోజు గడిల పరిపాలను తెలంగాణ అర్థం అవుతున్నది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో రాబోయే రోజుల్లో ఎన్నికల్లో బుద్ధి చెప్తాం.
ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీలో గెలుపు కోసం అన్ని సామాజిక వర్గాలు, గెలుపు కోసం కృషి చేస్తే గడిల పరిపాలన శాంపిల్ పథకాల ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు తాకట్టు పెట్టి పినపాక నియోజకవర్గం ప్రజలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా గౌరవంగా బతక్కుండా ఇబ్బంది పెడుతున్న పరిపాలనకు శరమగీతం ఓటు అనే ఆయుధం ద్వారా పోరాడుతాం. బీఎస్పీ జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలకు బి. ఎస్. పి పార్టీ అండగా ఉంటుంది డాక్టర్” ఆర్ఎస్పీ నాయకత్వంలో సుపరిపాలన అందిస్తామని తెలుపుతున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!