తెలుగు సరస్వతీ ముద్దుబిడ్డ మహాకవి దాశరథి

తెలుగు సరస్వతి ముద్దుబిడ్డ మహాకవి దాశరధి
…… నాని రాజు
అమలాపురం యువతరం ప్రతినిధి;
నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న మహాకవి డాక్టర్ దాశరధి అభ్యుదయ కవిగా మానవతావాదిగా ప్రజల హృదయాల్లో అక్షర శిఖరమై సుస్థిరంగానిలిచి ఉన్నారని అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక కోనసీమ జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులు, సాయి సంజీవని వాకర్స్ యోగ ఆరోగ్య సంస్థ అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు వెంకటరాజు నాని రాజు అన్నారు శనివారం మధ్యాహ్నం శ్రీ శ్రీ కళావేదిక జిల్లా శాఖ, సాయి సంజీవని వాకర్స్ యోగ ఆరోగ్య సంస్థల ఆధ్వర్యంలో కూచిమంచి వారి అగ్రహారం లో గల సాయి సంజీవిని ఆసుపత్రి ఆడిటోరియంలో జరిగిన మహాకవి దాశరధి 99వ జయంతి సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త , సీనియర్ తెలుగు లెక్చరర్, సాయి సంజీవిని వాకర్స్ యోగా ఆరోగ్య సంస్థ కార్యదర్శి నల్లా నరసింహమూర్తివిచ్చేసి ప్రసంగిస్తూ నా పేరు ప్రజా కోటి, నా ఊరూ ప్రజావాటి, అంటూ దాశరధిసర్వ మానవ సౌభ్రాతృత్వానికోరుకున్నారని ఆయన అన్నారు. తెలుగు చిత్ర సినిమాలో మధురాతి మధురమైన 200 సినీ గీతాలు రచించి తెలుగువారి హృదయాలలో నిలిచి ఉన్నారని నల్లా అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందాలని ,ఆంధ్ర విశ్వవిద్యాలయం దాశరథి కి. కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించిందని ఆయన అన్నారు దాశరథి తన రుద్రవీణ కావ్యాన్ని తెలంగాణా కు అంకితం ఇచ్చారని ఆయన అన్నారు. ప్రముఖ కవిబి.వి.వి సత్యనారాయణ మాట్లాడుతూ ఉర్దూ పారశీక కవిత్వపు సోంపులను దాశరది గాలిబ్ గీతాలుగా అందించారని ఆయన అన్నారు. కార్యక్రమంలో తొలుత దాశరధి చిత్రపటానికి నాని రాజు , అంతర్జాతీయ వాకర్స్ ఏరియా వన్ కోఆర్డినేటర్ తేతల సత్యనారాయణ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .అనంతరం దాశరధి కవితా వైభవం అనే అంశంపై కవి సమ్మేళనం జరిగింది.. కార్యక్రమంలో జిల్లా శ్రీశ్రీ కళావేదిక ఉపాధ్యక్షులు గుర్రం రామకృష్ణారావు, విశ్రాంత పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ అద్దంకి అమరేశ్వర రావు,కొప్పిశెట్టి నాగేశ్వరరావు, చాట్ల లక్ష్మీనారాయణ,రవణం వేణుగోపాలరావు, జాతీయ అవార్డు గ్రహీత కడలి సత్యనారాయణ ,డాక్టర్ శ్రీపాద రామకృష్ణ,, డాక్టర్ వైటిబి వెంకటేష్, అరిగెల బలరామమూర్తి, పాల్గొన్నారు.