భద్రాచలంలో గోదావరి నది ఉధృతిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

భద్రాచలంలో గోదావరి నది ఉధృతిని పరిశీలించిన
రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
భద్రాద్రి యువతరం ప్రతినిధి;
భద్రాచలం వద్ద పెరుగుతున్న వరదల గోదావరి ఉధృతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. గోదావరి వరదల వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. వరదలు పెరిగే సూచనలు ఉన్నప్పుడు ముంపు ప్రజలకు అవగాహన కల్పించి పునరావస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ముంపు ప్రాంత ప్రజలను తరలించే సమయంలో అన్ని సదుపాయాలు కల్పించడంతో దృష్టి సారించాలని పేర్కొన్నారు. కాలువలు చెరువులు కుంటలు చెక్ డ్యామ్ లు వద్ద రక్షణ చర్య తీసుకోవాలన్నారు. రెవిన్యూ పంచాయతీ ఇరిగేషన్ విద్యుత్ పోలీస్ శాఖ ఆరోగ్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని చెప్పారా అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని కోరారు.