వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు
– టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్న తాసిల్దార్ ప్రసాద్
భద్రాద్రి యువతరం ప్రతినిధి.
పినపాక మండలంలో పలు వరద ప్రభావిత ప్రాంతాలలో డీఎస్పీ రాఘవేంద్రరావు, తాసిల్దార్ ప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్ పర్యటించి పరిశీలించారు. గత సంవత్సరం వచ్చిన వరదలలో పూర్తిగా నష్టపోయిన చింతల బయ్యారం, టీ కొత్తగూడెం పలు గ్రామాలను పరిశీలించారు. రహదారితో సంబంధాలు లేని గ్రామాలు ఏమైనా ఉన్నాయా అని విచారణ చేపట్టారు. అనంతరం స్థానిక అధికారులను అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వీలైనంత సహాయం అందిస్తారని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు. ముంపు ప్రాంత బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేశారు .
గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా మండలంలోని వరద ప్రభావిత గ్రామాలలో ఎటువంటి నష్టం జరిగినను తక్షణమే స్పందించి తహశీల్ధార్ వారి కార్యాలయం, పినపాక నందు ఏర్పాటు చేయబడిన 24/7 కంట్రోల్ రూమ్ నెంబర్:6301557027 గణపతి రావు కు సమాచారం అందించగలరని తహసీల్దార్ కోరారు. అనవసరంగా గోదావరి దాటే ప్రయత్నం చేయవద్దని చేపల వేటకు వెళ్ళవద్దని సిఐ రాజగోపాల్ తెలియజేశారు. వీలైనంతవరకు బయటకు రాకుండా ఉండటమే మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై నాగుల్ మీరా ఖాన్, రెవిన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.