సమస్యలను పరిష్కరించాలని గ్రామ సేవకులు దీక్షలు

సమస్యల ను పరిష్కరించాలని గ్రామ సేవకులు దీక్షలు
తుగ్గలి యువతరం విలేఖరి;
గ్రామస్థాయిలో పనిచేస్తున్న విలేజ్ రెవెన్యూ సహాయకుల ( వీఆర్ఏ) సమస్యలను పరిష్కరించాలంటూ గురువారం తహసిల్దార్ కార్యాలయం వద్ద దీక్షలు గ్రామ సేవకులు చేపట్టారు. ఈ దీక్షలను గ్రామ సేవకుల పత్తికొండ డివిజన్ అధ్యక్షులు రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళుతున్న వీఆర్ఏల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు .వీఆర్ఏలకు పే స్కేల్ వేతనాలు ఇవ్వాలని, నామినేలకు వీఆర్ఏలు ఇవ్వాలని, ఆరులైన వీఆర్ఏలకు అటెండర్లుగా, వీఆర్ఏలుగా ,వాచ్మెన్ గా ప్రమోషన్ ఇవ్వాలని, వేతనం రూ 26,000 ఇవ్వాలని , ప్రభుత్వం గృహాలు నిర్మించి ఇవ్వాలని మాట్లాడారు. అలాగే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఆయన తెలిపారు. ఈనెల 21వరకు న తాసిల్దార్ కార్యాలయం వద్ద, ఆగస్టు 7, 8 న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, 23 ,24 న విజయవాడలోనే సచివాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టి 25న జగనన్నకు చెబుతాం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి అంపయ్య ,వీఆర్ఏల సంఘం నాయకులు రాజు, రామాంజనేయులు ,రామచంద్ర తదితరులు పాల్గొన్నారు .