ANDHRA PRADESHPROBLEMSSTATE NEWS
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
వీఆర్ ఏ ల సంఘం డిమాండ్
కొత్తపల్లి యువతరం విలేఖరి;
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఎ ల సంఘం మండల అధ్యక్షులు శీలంరవికుమార్, మండల ఉపాధ్యక్షులు మియ్యసాలు డిమాండ్ చేశారు. వీఆర్ఎల సమస్యల పై గురువారం తహసీల్దార్ కార్యలయం ముందు వీఆర్ఎలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వీఆర్ఎలకు పదోన్నతులు కల్పించాలని పేస్కేలు అమలు చేయాలన్నారు. నామినీలుగా పని చేస్తున్న వారికి వీఆర్ఏలుగా నియమించాలన్నారు. డీఏ రికవరిని ఆపి డీఏతో కూడిన వేతనం అందించాలన్నాడు. గత నలుగు సంవ్సరాలు వీఆర్ఎల సమస్యల పై పోరాటం చేస్తున్న పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల వీఆర్ఎలు పాల్గొన్నారు.