ANDHRA PRADESHEDUCATIONOFFICIAL

ప్రభుత్వ నిబంధనలు పాటించని భాష్యం స్కూల్ సీజ్

ప్రభుత్వ నిబంధనలను పాటించని భాష్యం స్కూల్ సీజ్

నాలుగు రోజుల పోరాటానికి దిగివచ్చిన విద్యాశాఖ అధికారులు

ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;

స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి కార్పొరేట్ భాష్యం రెండవ బ్రాంచ్ ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా యదేచ్చగా పాఠశాల రెండో బ్రాంచ్ నడుపుతూ విద్యార్థులను విద్యార్థు ల తల్లిదండ్రులను మోసం చేస్తూ వేళలో ఫీజులు వసూలు చేస్తూ ఫీజుల పట్టిక ఏర్పాటు చేయకుండా తల్లిదండ్రుల నుండి వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న భాష్యం స్కూల్ ని సీజ్ చేయాలని గత నాలుగు రోజుల నుండి విద్యార్థి సంఘాల ఉద్యమానికి గురువారం స్థానిక విద్యాశాఖ అధికారులు దిగివచ్చి ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి రెండో బ్రాంచ్ భాష్యం స్కూల్ ని అధికారులు సీజ్ చేయడం జరిగింది విద్యాధికారులు యాజమాన్యం లో మాట్లాడుతూ మీరు ప్రభుత్వ అనుమతులు తెచ్చుకున్న తరువాత పాఠశాల ఓపెన్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు యాజమాన్యాన్ని హెచ్చరించారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థి సంఘాల నాయకులు పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి రాజేష్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమైక్య జిల్లా కార్యదర్శి శేఖర్, యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ఉదయ్, ఆర్ ఏ వి ఎఫ్ జిల్లా కార్యదర్శి కాజా, కృష్ణ, డి ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సురేంద్రబాబు, ఆర్ పి ఎస్ ఎఫ్, రాష్ట్ర కార్యదర్శి ఆఫ్రికా, పి ఎస్ యు, జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో ఇలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా యదేచ్చగా నడుపుతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు,వీర ప్రతాప్, నవీన్, నబి సబ్, రఫీ, తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!