అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఘనంగా యోగా కార్యక్రమం





12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వెల్దుర్తి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఘనంగా యోగా కార్యక్రమం
పాల్గొన్న పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్
వెల్దుర్తి జూన్ 21 యువతరం న్యూస్:
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వెల్దుర్తి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి యోగా ఆసనాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యోగ అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సనాతన జీవన విధానం అని అన్నారు. వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు మానవాళి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అందించిన ఈ మహోన్నత సంప్రదాయం నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమైందని పేర్కొన్నారు. భారతదేశ ప్రతిపాదనతో ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్యసమితి వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు.
నిత్యం యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతాయని, ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి వ్యాధులను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజూ యోగా సాధన చేస్తే చదువులో మెరుగైన ప్రతిభ కనబరచడంతో పాటు ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించుకోగలరని సూచించారు.
“ఆరోగ్యవంతమైన సమాజమే అభివృద్ధి చెందిన సమాజానికి పునాది” అని పేర్కొన్న ఎమ్మెల్యే , ప్రతి కుటుంబం యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానాలను ప్రోత్సహిస్తోందని, యోగా ద్వారా ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా తెదేపా నాయకులు బొమ్మిరెడ్డి పల సుబ్బరాయుడు, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్, తెలుగు యువత నాయకులు సుధాకర్ గౌడ్, ఎంపీడీవో చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మార్వో చంద్రశేఖర్ వర్మ, హోమియోపతి డాక్టర్ భారతి, డిప్యూటీ ఎంపీడీవో రవి కిషోర్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.



