జొన్నగిరి బంగారు గనులను పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు


జొన్నగిరి బంగారు గనులను పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
తుగ్గలి, జూన్ 24 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా జొన్నగిరిలో జియో మైసూర్ సర్వీసెస్ – డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థ నిర్వహిస్తున్న బంగారం ఉత్పత్తి కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించి పరిశీలించారు. గనుల తవ్వకాల నుంచి ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి బంగారంగా మార్చే ప్రక్రియను స్వయంగా వీక్షించారు.
ఈ సందర్భంగా ఉత్పత్తి యూనిట్‌లోని వివిధ విభాగాలను సందర్శించిన సీఎం, బంగారం శుద్ధి ప్రక్రియతో పాటు తుది ఉత్పత్తులైన బంగారు బిస్కెట్లు, బంగారు కణాలు మరియు ఇతర రూపాల్లో తయారైన ఉత్పత్తులను పరిశీలించారు. ఉత్పత్తి విధానంపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
జియో మైసూర్ సంస్థ చైర్మన్ ముఖ్యమంత్రికి గనుల తవ్వకాల నుంచి బంగారం తుది ఉత్పత్తి వరకు జరిగే ప్రతి దశను వివరించారు. రాష్ట్రంలో ఖనిజ సంపద అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరియు ఉపాధి అవకాశాల పెంపులో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని వారు తెలిపారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.



