గడప గడపకు గడల కార్యక్రమం వాయిదా
భద్రాద్రి యువతరం ప్రతినిధి.
కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ నెల 22 వ తేదీన తలపెట్టిన గడప గడపకు గడల
కార్యక్రమం వాయిదా వేసినట్లు డా.గడల శ్రీనివాసరావు ప్రకటించారు.
అధిక వర్షాల పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 22 వ తేదీన, కొత్తగూడెం పట్టణం లోని 24 వార్డ్ నుండి ప్రారంభం కావాల్సి ఉన్న గడప గడపకు గడల కార్యక్రమం వాయిదా వేసినట్లు… కార్యక్రమ పునః ప్రారంభ వివరాలు అతి త్వరలో తెలియజేయబడునని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
గడప గడపకు కార్యక్రమం ద్వారా కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ వారి సామాజిక, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ వారి కుటుంబానికి ఓ పెద్దకొడుకులా నేనున్నానంటూ భరోసా ఇవ్వనున్నారు.
కొత్తగూడెం నియోజకవర్గంలో డా. జీఎస్ ఆర్ ట్రస్ట్ పేరిట అనేక సంక్షేమ కార్యక్రమాలతో గడల శ్రీనివాసరావు ఇప్పటికే ప్రజలలో అత్యధిక ప్రాధాన్యత పొందారు. త్వరలో ప్రారంభం కానున్న గడప గడపకు గడల కార్యక్రమాన్ని ఆధరించాలని కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలను ఈ సందర్బంగా కోరారు.