
పొంగులేటి శీనన్నకు ఘన స్వాగతం పలికిన పాయం వెంకటేశ్వర్లు
భద్రాద్రి యువతరం ప్రతినిధి;
హైదరాబాద్ గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి తొలిసారి ఖమ్మం గడ్డపై కాలు పెడుతున్న సందర్భంగా భారీ కాన్వాయ్ తో కూసుమంచికి చేరుకొని అక్కడి నుంచి సాదరంగా స్వాగతం పలుకుతూ ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి (శీనన్న)కి గురువారం ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.