OFFICIALTELANGANA

రోడ్డుపై నడిపిన రెండు కేజ్ విల్ ట్రాక్టర్లు సీజ్

రోడ్డుపై నడిపిన రెండు కేజ్ విల్ ట్రాక్టర్ లు సీజ్

గాంధారి యువతరం విలేఖరి;

గాంధారి మండలంలోని పోతంగల్ గ్రామ శివారులో రోడ్డుపైన కేజీవీల్ ట్రాక్టర్ ను నడిపిన రెండు ట్రాక్టర్లను గురువారం సీజ్ చేయడం తో పాటు ఇద్దరు ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేయడం జరిగిందని గాంధారి సబ్ ఇన్స్పెక్టర్ డి.సుధాకర్ తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ గాంధారి మండలంలోని పోతంగాల్ గ్రామానికి చెందిన వెనువర్దన్ రెడ్డి,సాయిలు తమ కేజీ వీల్ తో పోతాంగల్ గ్రామ శివారులో తారు రోడ్డుపై  ట్రాక్టర్ నడుపుతుండగా పట్టుకొని సీజ్ చేసి ,కేసు నమోదు చేసామని అయన తెలిపారు. తారు రోడ్డుపై కేజీ విల్ తో ట్రాక్టర్ నడపడం కారణంగా రోడ్లు పాడవుతున్నాయని అందుకే కేసు నమోదు చేయడం జరిగిందనీ అన్నారు. తారు రోడ్డుపై కేజీవీల్తో ట్రాక్టర్లు నడిపితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది అన్నారు . కేజీ వీల్ తో తారు రోడ్లపై ట్రాక్టర్లు నడిపితే పోలీసులకు సమాచారం అందించాలని  అయన అన్నారు. కేజీవీల్ ట్రాక్టర్ లను సీజ్ చేయడం లో ఎస్సై వెంట ఏఎస్సై గణేష్, కానిస్టేబుల్ లు యాదగిరి, ప్రణీత్, భనుచందర్, దిలిప్ లు ఉన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!