
ఎమ్మెల్యే సారు ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి చూడు
కామారెడ్డి యువతరం ప్రతినిధి;
నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటరమణారెడ్డి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు సౌకర్యాలు కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్నారని కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు, రోగులకు సరైన సౌకర్యాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కామారెడ్డి బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని కాటిపల్లి వెంకటరమణ రెడ్డి బిజెపి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని గొప్పలు చెబుతున్నారని దీంతో ఆస్పత్రిలోని రోగులకు సిబ్బందికి ఆసుపత్రి స్థితిగతులను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వర్షానికి ఆస్పత్రి ఆవరణ వర్షానికి కురిసి పైకప్పు పెచ్చులు పడడంతో రోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని రోగులు ఎవరైనా ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని, కావున సంబంధిత అధికారులు క్రికెట్ ఆస్పత్రిలో రోగులకు అందే సేవలను సకాలంలో అందించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ లు మొటూరి శ్రీకాంత్, నరేందర్, ప్రవీణ్, నాయకులు భరత్, సురేష్, వేణు, రాజేష్, భరత్, రాజ్ గోపాల్ , శివ, సన్ని తదితరులు పాల్గొన్నారు