కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవులపై దాడులను అరికట్టాలి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవులపై దాడులను అరికట్టాలి
ఆల్ క్రిస్టియన్ సంఘాలు డిమాండ్
ఎమ్మిగనూరు యువతరం విలేఖరి;
ఎమ్మిగనూరు పట్టణంలో మహాదేవుని చర్చి నందు ఆల్ క్రిస్టియన్ చర్చస్ యునైటెడ్ అసోసియేషన్ పాస్టర్స్ ఆధ్వర్యంలో గురువారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆల్ క్రిస్టియన్ చర్చెస్ యునైటెడ్ రాష్ట్ర ప్రెసిడెంట్ ఆనంద్ రాజ్ మాట్లాడుతూ భారత దేశంలో పలుచోట్ల క్రైస్తవ మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని దాన్ని అరికట్టే విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలమై ఉన్నాయని అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవ చర్చిలపై పాస్టర్లపై దాడులు చేస్తూక్రైస్తవ విశ్వాసులైన స్త్రీలు పైన విచ్చలవిడిగా అవమాన పరుస్తున్న మతోన్మాద శక్తుల నుండి కాపాడి రక్షించవలసిన బాధ్యత మణిపూర్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నది కావున ప్రభుత్వాలు వెంటనే స్పందించిపరిస్థితిని చూసి క్రైస్తవులపై దాడులను అరికట్టగలరని కేంద్ర ప్రభుత్వం జోక్యం తీసుకొని దాడులు ఆపాలని ఆల్ క్రిస్టియన్ చర్చెస్ యునైటెడ్ అసోసియేషన్ పాస్టర్స్ కోరారు లేనిపక్షంలో అన్ని మండలాల్లో జిల్లాస్థాయి రాష్ట్రస్థాయిలో క్రైస్తవ ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు రెవరెండ్ జి ఆనంద్ రాజ్ ఏ సి సి యు ఏ రాష్ట్ర.ప్రెసిడెంట్ ఆదోని. పాస్టర్ఏ లాజర్.పాస్టర్ రాజు సుదర్శన్. జేసు సుధాకర్ ప్రభుదాస్. భాస్కర్. ఇశ్రాయేలు. జైపాల్ తదితరులు పాల్గొన్నారు.