ANDHRA PRADESHOFFICIAL

ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ చేతుల మీదుగా తూముకు భూమి పూజ

ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ చేతుల మీదుగా తూముకు భూమి పూజ

వెల్దుర్తి మే 30 యువతరం న్యూస్:

వెల్దుర్తి మండలంలోని మల్లెపల్లె హంద్రీనీవా కాల్వ సమీపంలో తూముకు శుక్రవారం ఎమ్మెల్యే భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ తూము ఏర్పాటు వల్ల దాదాపు 1,000 ఎకరాలకు నీరు అందే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా నార్లాపురం, బొమ్మిడి పల్లె, అల్లుగుండు,మల్లెపల్లె పొలాలకు నీరు అందుతుందన్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ గ్రామాలలో ప్యాక్షన్ తగ్గుముఖం పడుతుందన్నారు. తన తండ్రి మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గతంలో ఇక్కడ తూము ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ప్రభుత్వం మారడం వల్ల ఆ కోరిక నెరవేర లేకపోయిందన్నారు. తన హయాంలో తూము ఏర్పాటు జరగడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!