జగనన్న సురక్ష పేదలకు వరం

జగనన్న సురక్ష పేదలకు వరం
అర్హుల అందరికీ సంక్షేమ పథకాలు
సచివాలయ మండల కన్వీనర్ హనుమంతు
తుగ్గలి యువతరం విలేఖరి;
గ్రామీణ పట్టణ ప్రాంతాలలోనే ప్రజలకు జగనన్న సురక్ష వరం లాంటిదని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిందికే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు సచివాలయ మండల కన్వీనర్ ఆర్. హనుమంతు అన్నారు. గురువారం శభాష్ పురం, గిరిగేట్ల జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సచివాలయ మండల కన్వీనర్ హనుమంతు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల పాదయాత్రలో ఇచ్చిన హామీలలో భాగంగా నవరత్నాల పథకాలను అర్హులైన అందరికీ పార్టీలకు, కులాలకు ,మతాలకు అతీతంగా అందివ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఎమ్మెల్యే శ్రీదేవమ్మ నియోజవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అందువల్ల రానున్న ఎన్నికలలో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు. అనంతరం ఎంపీడీవో సావిత్రి, తహసిల్దారు రవి డిప్యూటీ తాసిల్దార్ నిజాముద్దీన్ లు లబ్ధిదారులకు 11 రకాల ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శిలు గోపాల్, కార్తీక్, వీఆర్వోలు రామాంజనేయులు, రామలింగప్ప, సచివాల హెల్త్ కార్యదర్శులు దేవి, నాగమణి, వైఎస్ఆర్ సీపీ నాయకులు గూటిపల్లి రవి, విష్ణువర్ధన్ రెడ్డి, ఎంభాయ్ రామాంజనేయులు, గంతుల పకీరప్ప, ఫీల్డ్ అసిస్టెంట్లు రఘురాం రెడ్డి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.