మండలంలో కొనసాగుతున్న జీపు జాత

మండలంలో కొనసాగుతున్న జీపు జాత
తుగ్గలి యువతరం విలేఖరి;
కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి జులై 26 నుండి 31 వరకు ఆదోని నుండి కర్నూలు వరకు వందలాది మందితో సిపిఎం మహాపాదయాత్ర జయప్రదం చేయాలని కోరుతూ గురువారము మండల కేంద్రమైన తుగ్గలి మీదుగా జాత సాగింది. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జిల్లాలో పత్తికొండ నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో ప్రజలు పలు సమస్యలతో ప్రజలు, రైతులు సతమతమవుతున్నారన్నారు. పత్తికొండకు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీకు భూమి పూజ చేస్తామని స్వయంగా సీఎం చెప్పిన ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదన్నారు. అదేవిదంగా హంద్రీనీవా నుండి చెరువులన్నిటికీ నీటిని అందిస్తామని పాలకులు చెప్పిన ఇంతవరకు చెరువులకు నీరు అందించింది లేదన్నారు. హంద్రీ నివా నుండి చెరువులకు నీరు అందిస్తే అటు సాగుకు ఇటు త్రాగుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చింది నాలుగేళ్ల గడిచిన ఇంతవరకు హంద్రీనీవా నుండి నీటిని మళ్ళించకపోవడం విచారకరమన్నారు .2022 సెప్టెంబర్ కల్లాహంద్రీ నీవా నీటిని అందిస్తామని పత్తికొండ శాసనసభ్యులు చెప్పిన 2023 సెప్టెంబర్ దగ్గర పడుతున్నప్పటికీ హంద్రీనీవా నుండి చెరువులకు నీటిని అందించలేకపోయారన్నారు. పలు సమస్యలు పై చేస్తున్న పాదయాత్రను రైతులు ప్రజలు విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రవి, సిఐటియు రాముడు, రైతు సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, కొండారెడ్డి, రైతు సంఘము మండల కమిటీ అధ్యక్షులు రంగస్వామి, సిపిఎం కమిటీ సభ్యులు, సురేంద్ర, రంగరాజు డి వై ఎఫ్ ఐ నాయకులు ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.