
శివారు కాలనీలో ప్రజలకు కూడా కనీస సౌకర్యాలు కల్పించాలి: సిపిఎం
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
శివారు కాలనీలో ప్రజలకు కూడా కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం పట్టణ నాయకులు రాముడు లక్ష్మీ నరసయ్య డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని గూడూరు బైపాస్ రోడ్డు, దోబిగాట్ ఏరియా ప్రాంతాలలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో మురికి నీరు వర్షపు నీరు ఆగి ఉండడంతో ప్రజలకు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెంటనే రోడ్లను మరమ్మతులు చేయాలన్నారు. రోడ్డుతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ వీధిలైట్లు విద్యుత్ వైర్ల బోరింగ్ రిపేరు తదితర సమస్యలు ఉన్నాయని వీటిని వెంటనే మున్సిపల్ అధికారులు పరిష్కరించాలని కోరారు. ఈనెల 26 నుండి 31 వరకు సిపిఎం పార్టీ చేపట్టే మహా పాదయాత్రలో కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా అనంతరం కలెక్టర్కు సమస్యలపై విన్నవిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సిపిఎం నాయకులు కే మాదన్న, రామన్న, రాఘవేంద్ర, వలీ, వీరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.