ANDHRA PRADESHOFFICIAL
వెల్దుర్తి మండల తహసిల్దార్ గా శివరాముడు బాధ్యతల స్వీకరణ

వెల్దుర్తి మండల తహసిల్దారుగా శివరాముడు బాధ్యతల స్వీకరణ
వెల్దుర్తి యువతరం విలేఖరి;
వెల్దుర్తి మండల తహసిల్దార్ గా శివరాముడు బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ మండలంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చిన తన కార్యాలయంను సంప్రదించవచ్చు అన్నారు. ముఖ్యంగా సిబ్బంది ప్రజా సమస్యలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సిబ్బందిపై తగిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న భూ సర్వే ను ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా మండల కేంద్రమైన వెల్దుర్తిలో ముగ్గురు వీఆర్వోలు, కలగొట్ల, సూదేపల్లెలో ఇద్దరు వీఆర్వోలు లేకపోవడం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.