ANDHRA PRADESHPOLITICSSTATE NEWS
నందికొట్కూరులో భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్ర

నందికొట్కూరులో భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర
నందికొట్కూరు యువతరం ప్రతినిధి;
నందికొట్కురులో భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్ర లో భాగంగా సూర్యనారాయణ దేవాలయం లో నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మండ్ర శివానందరెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమం లో పాల్గొని బస్సు యాత్ర ప్రారంభించారు. నార లోకేష్ యువ గళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూర్య నారాయణ దేవాలయం నుండి పటేల్ సెంటర్ వరకు నడిచి నందికొట్కూరు,పాణ్యo మాజీ ఎమ్మెల్యే పాణ్యo టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమం లో ,నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జయ సూర్య మరియు నియోజకవర్గ పరిధిలోని మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.