ANDHRA PRADESHPOLITICSSTATE NEWS

జగనన్న సురక్ష పేదవారికి రక్ష

ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

జగనన్న సురక్ష… పేదవారికి రక్ష

ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

కర్నూలు యువతరం ప్రతినిధి;

కర్నూలు నగరం లోని 2వ,7వ,18వ,49వ, వార్డుల్లో ఉన్న 5,18,44,125 వ సచివాలయలలో మంగళవారం  జగనన్న సురక్ష కార్యక్రమంలో  ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పలువురు లబ్ధిదారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో  ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రజా ముఖ్యమంత్రి  వై యస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజలకు మరింత చేరువుగా వారి కష్టాన్ని తీర్చుటకు సచివాలయలను పెట్టిన 100 కి 95 శాతం పూర్తి అవుతున్న ఇంకా ఆ పేద బడుగు బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలు,సర్టిఫికేట్ లు అందని వారికి మరింత మంచిని చేయాలనే లక్ష్యంతో సచివాలయంకి లబ్దిదారులు వారి సమస్యలు చెప్పుకోలేని ఇంకా ఉన్నారేమో అని గ్రహించి ప్రజలకు మరింత చేరువ చేయాలనే ధ్యేయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని పేర్కొన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, వైస్సార్ ఆరోగ్య శ్రీ, రైస్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్… అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్ గారు,యం.ఆర్.ఓ గారు,వార్డ్ కార్పొరేటర్లు,వార్డ్ ఇంచార్జిలు,స్పెషల్ ఆఫీసర్, సచివాలయం సిబ్బంది, సచివాలయం కన్వీనర్లు,పార్టీ ముఖ్య నాయకులు మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!