ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ రాజాం బస్ స్టేషన్ నిర్మాణం
మంత్రి బొస్త

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ, రాజాం బస్ స్టేషన్ నిర్మాణం
రాజాంలో బస్ డిపో ఏర్పాటుకు ప్రతిపాదన బస్ స్టేషన్ శంఖుస్థాపన కార్యక్రమంలో మంత్రి బొత్స, రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్
రాజాం యువతరం ప్రతినిధి;
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ, రాజాం బస్ స్టేషన్ నిర్మాణానికి,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పినిపే విశ్వరూప్ మంగళవారం శంఖుస్థాపన చేశారు. సుమారు రూ.కోటి, 48 లక్షల ఖర్చుతో, 1.42 ఎకరాల విస్తీర్ణంలో 10 ఫ్లాట్ ఫారాలతో ఈ నూతన బస్ స్టేషన్ ను నిర్మించనున్నారు.రోజుకు 126 బస్సులు, సుమారు 450 ట్రిప్పులు వేసే ఈబస్ స్టాండ్ ద్వారా, ప్రతిరోజూ దాదాపు 25 వేలమంది రాకపోకలు సాగించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, బస్ స్టేషన్ నిర్మాణం ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛగా పేర్కొన్నారు. రాజాంలో బస్ డిపో ఏర్పాటుకు కూడా ప్రతిపాదన చేస్తున్నట్లు చెప్పారు. దీనికి రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ కూడా సుముఖంగా ఉన్నారని వెళ్ళడించారు. బస్ స్టేషన్, డిపో ఒకే చోట ఉంటే సౌకర్యంగా ఉంటుందని సూచించారు. దీనికోసం సుమారు 3 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు దీనిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజాం ఎమ్మేల్యే కంబాల జోగులు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎంపి బెల్లాన చంద్ర శేఖర్, ఎమ్మెల్సి పాలవలస విక్రాంత్, ఎపీఎస్ ఆర్టీసి ఎండి ద్వారకా తిరుమల రావు, చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి, జోనల్ చైర్మన్ బంగారమ్మ, విజయనగరం జోన్ ఈడి సి రవికుమార్, మూడు జిల్లాల ప్రజా రవాణా అధికారులు ఏ.విజయ్ కుమార్, కె.వెంకటరావు, సిహెచ్ అప్పల నారాయణ, డిపో మేనేజర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలు ఎంపీపీలు జెడ్పీటీసీలు వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, ఆర్టీసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనంతరం సూర్యదుర్గ కళ్యాణ మండపంలో రాజం నియోజకవర్గ అభివృద్ధి పనులపై నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాతపదిక అంశంలో సచివాలయ భవనాల నిర్మాణం పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నాయకులకు మరియు అధికారులకు సూచించారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పనులపై నాలుగు మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రాతపదిక అంశంలో సచివాలయ భవనాల నిర్మాణం పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నాయకులకు మరియు అధికారులకు సూచించారు.