ANDHRA PRADESHPOLITICSSTATE NEWS

మహిళలంటే పవన్ కళ్యాణ్ కు గౌరవం లేదు

మంత్రి ఉషశ్రీ చరణ్

మహిళలంటే పవన్ కళ్యాణ్ కు గౌరవం లేదు

వలంటీర్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

మంత్రి ఉషాశ్రీచరణ్

విజయవాడ యువతరం ప్రతినిధి;

మహిళలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గౌరవం లేదని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్  అన్నారు.
వలంటీర్లను కించపరిచేలా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉషాశ్రీచరణ్  ఖండించారు.సీఎం జగనన్న ప్రవేశ పెట్టిన సచివాలయ వలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
ఇతర దేశాల ప్రతినిధులు మన వలంటీర్ వ్యవస్థ పనితీరును పరిశీలించి వారి దేశంలో అమలు చేసేందుకు కసరత్తు చేసుకుంటున్నారన్నారు.ఇంతటి బాధ్యతాయుతమైన వలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా కుల, మతాలు తేడా లేకుండా పథకాలను గడప గడపకూ అందిస్తున్న వలంటీర్ వ్యవస్థపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్ర పన్నారన్నారు.
పవన్ కళ్యాణ్ ను చూడగానే ఆడపిల్లలు భయపడే పరిస్థితి ఉందన్నారు. వలంటీర్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!