కలుషిత నీటిని అందించిన వారిపై చర్యలు తీసుకోవాలి
బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి మురహర రెడ్డి

కలుషిత నీటిని అందించిన వారిపై చర్యలు తీసుకోవాలి
బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి మురహర రెడ్డి డిమాండ్
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు తాగునీరు అందించడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి మురహర రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఎమ్మిగనూరు పట్టణానికి వచ్చే గుడికల్లు చెరువును పరిశీలించి అక్కడే పరిస్థితులను పరిశీలించారు. పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే విషయంలో అధికారులు కానీ పాలకుల గాని శ్రద్ధ చూపడం లేదని దీంతో మురికి నీటిని ప్రజలకు అందిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం తాను గుడుకల్ చెరువును పరిశీలించాలని అక్కడ గుడికల్లు గ్రామం నుండి వచ్చే కలుషిత నీటిని గుడికల్లు చెరువులో కలుస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం అదే నీటిని మరల తిరిగి అందిస్తున్నారని దీనివల్ల ప్రజలు రోగాలకు గురి అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు మంచినీటి సరఫరా చేయాల్సిన అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదని దీనిపై త్వరలోనే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.