
పేదల ఇంట పథకాల పంట
జగనన్న పాలనలో ఇంటింటా ఆనందం : ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి
ఎమ్మిగనూరు యువతరం విలేఖరి;
వైఎస్సార్సీపీ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఎమ్మిగనూరు మండల పరిధిలోని సోగనూరు గ్రామంలో సచివాలయం నందు రెండవ రోజు “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్ని ఆర్థిక అడ్డంకులు వచ్చిన హమీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారని కొనియాడారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దారని, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు, రసాయన మందులు, వ్యవసాయ సామగ్రి అందిస్తున్నారని వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వేంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, జెడ్పీటీ సర్పంచ్, కన్వీనర్లు, గృ సారథులు, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలెంటర్స్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.