
ఈమని లో జగనన్న సురక్ష కార్యక్రమం
వాలంటీర్ పాదాలు కడిగిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి( ఆర్కే)
దుగ్గిరాల యువతరం విలేఖరి;
దుగ్గిరాల మండలంలోని ఈమని సచివాలయం -2 పరిధి వాలంటీర్ జెట్టి రజితకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించడంతో పాటు ఆమె పాదాలను కడిగి నమస్కరించారు. మంగళవారం నియోజకవర్గ పరిధి దుగ్గిరాల మండలం ఈమని లో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆర్కే వాలంటీర్లు అందిస్తున్న సేవలను కొనియాడుతూ విశేష సేవలు అందించిన వాలంటీర్ జెట్టి రజితను ఘనంగా సత్కరించడంతో పాటు ఆమె పాదాలను కడిగి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి, దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణ తదితరులు పాల్గొన్నారు.