
డోర్నకల్ సీటు గెలిపించే బాధ్యత నాదే
పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ
ఖమ్మం యువతరం ప్రతినిధి;
డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షులు మండల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రాంచందర్ నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డాక్టర్ రాంచందర్ నాయక్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులను మండల అధ్యక్షులను పరిచయ కార్యక్రమం ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి నివాసంలో నిర్వహించారు. డాక్టర్ రాంచందర్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట అని డోర్నకల్ నియోజకవర్గాన్ని గెలిపించే బాధ్యత నాదేనని నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ పార్టీ అధ్యక్షులు పనిచేయాలని సూచించారు. ఖమ్మంలో నిర్వహించిన జన గర్జన సభకు డాక్టర్ రాంచందర్ నాయక్ నేతృత్వంలో 20 వేల మందిని తరలించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పారు.రాష్ట్రంలో రావణకాష్టను అంతమందించేందుకు ప్రతి కార్యకర్త చురుగ్గా పనిచేయాలని కోరారు.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎవరికి ఏ ఆపద వచ్చినా శీనన్న అని గడప తొక్కితే నా దాంట్లో ఉన్న కొద్ది మీకు సాయం చేస్తానని వారన్నారు.
డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రాంచందర్ నాయక్ అభినందించారు అనారోగ్యంగా ఎవరు వచ్చినా ఉచిత వైద్యం చేస్తున్న గొప్ప మనసు డాక్టర్ రాంచందర్ నాయక్ అని వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,గ్రామ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అనుబంధ విభాగాల నాయకులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు