రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
ఏపీ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర నాయకులు లింగమయ్య

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
ఏపీ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర నాయకులు లింగమయ్య
పెద్దవడుగూరు యువతరం విలేఖరి;
రజకులను జాబితాలో చేర్చాలని ఏపి రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర నాయకులు టి.లింగమయ్య, జిల్లా కార్యదర్శి నాగయ్యలు ప్రభుత్వాన్ని చేశారు. ఆదివారం గంగమ్మగుడి ఆవరణంలో వారు వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోగా ఒక కొత్త దోబీఘాట్ కూడానిర్మించక పోవడం, దోబీఘాట్లను పునరుద్దరించకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రజకులకు విద్యుత్ చార్జీలు పెంచి మోయలేని భారం వేస్తున్నా రన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న దోబీ పోస్టులను రజకులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.రజకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జిల్లా కేంద్రంలో ఈ నెల 21వ తేదిన రజక సంఘం రాష్ట్ర సదస్సు జరుగుతుంది కనుక జిల్లా వ్యాప్తంగా రజక సోదర సోదరీ మనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు కుల్లాయిస్వామి రామాంజనేయులు మల్లికార్జున,పాపన్న,వసంతు,పుల్లయ్య,సుంకన్న,కార్తీక్,సూరేంద్ర, ఈశ్వరమ్మ,రంగమ్మ అంజలి,వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.