
నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులుగా మల్లెల రాజశేఖర్ గౌడ్ ప్రమాణస్వీకారానికి హాజరైన ధర్మవరం సుబ్బారెడ్డి
నంద్యాల యువతరం ప్రతినిధి;
నంద్యాలలో యాతం టిసిఆర్ గార్డెన్స్ నందు నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్ ప్రమాణస్వీకారమునకు డోన్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆదివారం హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎన్ఎండి ఫారుక్ , జోనల్ ఇంచార్జ్ అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి ,మాజీ మంత్రివర్యులు ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియ, కర్నూలు జిల్లా అధ్యక్షులు బి.టి.నాయుడు,మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు మరియు డోన్ నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.