ఆరోగ్య మాత సహాయ డైరెక్టర్ ఫాదర్ అనిల్ కు ఆత్మీయ సన్మానం

ఆరోగ్యమాత సహాయ డైరెక్టర్ ఫాదర్ అనిల్ కు ఆత్మీయ సన్మానం
కడప యువతరం ప్రతినిధి;
2022, 23 సంవత్సరానికి గాను ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో ఫాదర్ అనిల్ ఎనలేని సేవలు చేశారని,
శాంతి సేవా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మడగలం ప్రసాద్ అన్నారు.
దివ్యబలి పూజ అనంతరం ఆయనకు బదిలీ సందర్భంగా గౌరవ సన్మాన కార్యక్రమంలో సొసైటీ సభ్యులు శాలువాతో మెమెంటోతో సత్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ,
గురుత్వ జీవితంలో దేవుడు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లి నలు దశల సువార్త చేయుడి అన్న, క్రీస్తు మాటలకు విదేయించి, ఫాదర్ అనిల్ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో మరియ తల్లి సమక్షంలో సహాయ డైరెక్టర్ గా ఉంటూ ప్రజలకు ఎనలేని సేవలు చేశారని, అందులో భాగంగానే ఆయన సేవలు మరోక ప్రాంతా విశ్వాసులకు అవసరమయ్యాయని, కడప అపోస్తులిక పాలన అధికారి బిషప్ గాలి బాలి తండ్రిగారి ఆదేశాల మేరకు ఆయనను టేకూరుపేట విచారణ గురువుగా నియమించారని ఆయన తెలిపారు.
ఫాదర్ అనిల్ సహాయ డైరెక్టర్ గా ఉంటూ చర్చి అభివృద్ధి నిర్మాణ పనులలో, విచారణ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలను విశ్వాస పదంలో నడిపించుటలో, గృహస్ట క్రైస్తవ సందర్శనలో యాత్రికుల విషయంలో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన వివరించారు.
టేకూరుపేట విచారణ విశ్వాసులను ఆధ్యాత్మిక పదంలో క్రీస్తు బాటలో ముందుకు నడిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫాదర్ అనిల్ మాట్లాడుతూ, ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో మరియ తల్లి చెంత పనిచేయడం ఓ అరుదైన భాగ్యం అని, ఇక్కడ ఉన్న పెద్దలు అమ్మగార్లు విశ్వాసులు చూపిన ప్రేమ అభిమానాలకు నేను రుణపడి ఉంటానని నేను ఎక్కడ ఉన్నా ఇక్కడి విశ్వాసుల కోసం ఇక్కడ అభివృద్ధి కోసం అనునిత్యం ప్రార్థిస్తూ ఉంటానని ఆయన అన్నారు.
కార్యక్రమంలో, పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ ఎండి ప్రసాదరావు సహాయ డైరెక్టర్ ఫాదర్ విల్సన్, అమ్మ గార్లు, సొసైటీ కోశాధికారి ఎలిజబెత్ సహాయ కార్యదర్శి విజయ్ మనోహర్, చర్చి కమిటీ పెద్దలు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు.
తదితరులు పాల్గొన్నారు.