
బోగత వాటర్ ఫాల్స్
వాజేడు యువతరం విలేకరి.
వాజేడు మండలం చిగుపల్లి గ్రామంలో బోగత జలపాతం చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అడవిలో గుట్టల్లో కురిసినటువంటి వర్షానికి బొగత వాటర్ ఫాల్స్ 50 అడుగుల ఎత్తు నుండి జాలవారుతున్న వాటర్ ని చూడడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో విచ్చేయుచున్నారు. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర పిల్లలు ఆడుకోవడానికి పిల్లల పార్కు, స్నానాలకు పెద్ద పెద్ద కోనేరులు తయారుచేస్తే పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో పకృతి చాలా అందంగా ఉంటుంది. అందుకోసం ఈ యొక్క బోగత వాటర్ ఫాల్స్ చూడడానికి పర్యాటకులు సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు. వీరికి కనీస సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.