
ఆలూరు నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు రావాలి
ఆస్పరి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు
ఆస్పరి యువతరం విలేఖరి;
వ్యక్తిగత విమర్శలు చేస్తున్న చిప్పగిరి మండల కన్వీనర్ ఏరూరు రంగస్వామి ను ఆస్పరి మండలం అంబేద్కర్ సర్కిల్ నందు చర్చకు సిద్ధమా అని ఆస్పరి మండలo పత్రిక విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శేషాద్రి నాయుడు,తంగరుడోన ఎంపిటిసి సభ్యులు నరసప్ప,తోగలగళ్లు సర్పంచ్ ఆంజనేయ ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ 2004లో డోన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశారు అన్నారు, ఒకసారి డోన్ వెళ్లి చూడండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫ్లై ఓవర్ బ్రిడ్జ్, 30 పడకల ఆసుపత్రి, శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, హంద్రీ నీవాకాలువ, నివాసయోగమైన కాలనీలు, విద్యాలయాలు, బేతంచర్ల డబల్ రోడ్డు అనేకమైనటి అభివృద్ధి పనులు చేశారు అని తెలిపారు.
ఆలూరు నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని వేదవతి ప్రాజెక్ట్ ఎనిమిది 8 టిఎంసీలు పూర్తి సామర్థ్యంతో నిర్మించాలని కోరారు.మీ నాయకుడు 2014 లో ఎమ్మెల్యే గా ఉన్నాడు, 2019 నుండి నాలుగు సంవత్సరాలుగా మంత్రి ఉన్నాడు ఆలూరు నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి పనులు చేశారో చెప్పండి వేదవతి ప్రాజెక్టు ఎనిమిది టిఎంసిల నుండి మూడు టీఎంసీలకి కుదించిన పరిస్థితి, త్రాగు,సాగునీరు, గ్రామాలలో అభివృద్ధి అయితేనేమి, మండలలో అభివృద్ధి అయితే నేమి ఎమి చేశారో చర్చకు సిద్ధమా అన్నారు.మాకు తెలిసి అభివృద్ధి అంటే గుమ్మనూరు కుటుంబం మాత్రమే అన్నారు.ఒకపక్క పేకాట క్లబ్లు, మరోక పక్క భూములు, మరొక పక్క కర్ణాటక మద్యం, ఆలూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అంటే ఇవేనేమో అని విమర్శించారు.అభివృద్ధి పైన చర్చించడానికి విమర్శలు చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలు మా ఇన్చార్జ్ కోట్ల సుజాతమ్మ అవసరం లేదు అని పేర్కొన్నారు.మీకు ఏ అర్హత ఉందని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ను విమర్శిస్తారన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు రాజ్ కుమార్, నాగేంద్ర, ఐ టిడిపి నాయకులు మహబూబ్ బాషా,మండల నాయకులు సోమనాథ్, సత్తన్న తదితరులు పాల్గొన్నారు.