
ఈ నెల 30 న కళాకారుల సంఘం ఎన్నికలు
– సభ్యత్వ నమోదుకు 23 ఆఖరి తేది
విశాఖ యువతరం ప్రతినిధి;
సంగీత సంస్థలు, గాయకులతో నెలకొల్పిన విశాఖ సంగీత కళాకారుల సంక్షేమ సంఘానికి ఈనెల 30న సీక్రెట్ బ్యాలట్ ద్వారా ఎన్నికలు జరగనుందని ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ చెన్నా తిరుమలరావు ప్రకటించారు. గురువారం రాత్రి విశాఖ పౌర గ్రంధాలయంలో జరిగిన కళాకారుల సర్వ సభ్య సమావేశంలో ఎన్నికల తేదీలను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిటీ కన్వీనర్ చెన్నా తిరుమలరావు మాట్లాడుతూ పలు కళా సంఘాలు, కళాకారులు ఎన్నో సమస్యలతో శతమత మౌతున్నారని వారి సమస్యల పరిస్కారం కొరకు కొత్త పాలక వర్గం ఎన్నికలు అవసరమయ్యిందన్నారు.ఈనెల 23 లోపు సభ్యత్వ నమోదు చేసుకోవాలని తెలిపారు. 25 నామినేషన్ల స్వీకారణ, 30వ తేదీన సీక్రెట్ బ్యాలట్ పద్దతిలో ఎన్నికలు జరువుతోందన్నారు. కళలు, కళాకారులను సేవ చేయాలన్న దృక్పదం కలిగిన వారు పోటీల్లో నిలబడాలని చెన్నా వివరించారు.
మరిన్న వివరాలకు 8179605267 నంబర్ కు సంప్రదించాలని కోరారు. తొలుత 9 మందితో ఏర్పాటైన ఆడ హాక్ కమిటీలో చెన్నా తిరుమలరావు ను ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ గా ఎన్నుకున్నారు
సమావేశంలో తాత్కాలిక కమిటీ సభ్యులు కొణతాల రాజు, మహ్మద్ ఖాన్, భయ్యా శ్రీనివాస్, జెఎంఆర్ నెహ్రూ, ఫణి భూషణ్, డి. భూపతిరావు, కందర్ప రాధ, ఎం. త్రినాధ్ రావు, గంటి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన మాట్లాడారు.