చంద్రబాబు తోనే రాష్ట్రానికి భవిష్యత్తు
మాజీ కేంద్రమంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి

చంద్రబాబు తోనే రాష్ట్రానికి భవిష్యత్తు
మాజీ కేంద్రమంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి
పెద్దకడుబూరు యువతరం విలేఖరి;
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోనే రాష్ట్రానికి భవిష్యత్ అని మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దకడుబూరు మండలంలోని తారాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బి.టి.నాయుడు అధ్యక్షతన జరిగిన భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర జిల్లా నాయకులతోపాటు నియోజకవర్గ ఇంచార్జిలు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన టిడిపి కార్యకర్తలనుదేశించి కోట్ల మాట్లాడుతూ జగన్ పాలన అవినీతిమయంగామారిపోయిందని మండిపడ్డారు.తన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన ఏనాడు అవినీతి,అక్రమాలకు పాల్పడలేదని నిజాయితీగా పరిపాలించామని గుర్తు చేశారు. టిడిపి కార్యకర్తలపై పోలీసులు చేత తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని,వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారుపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. టిడిపి మహానాడు వేదికగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన మహిళలకు “మహాశక్తి” యువ గళం అన్న ధాత,ఇంటింటికి నీరు,బీసీలకు రక్షణ చట్టం,పూర్ టు రిచ్ ఆరు అంశాల మిని మేనిఫెస్టోను ప్రజలలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు.జిల్లా రైతాంగం కోసం తాను రాజకీయ మార్పు కోరి చంద్రబాబు సహకారంతో వేదవతి,గుండ్రేవుల,ఆర్.డి.యస్,కుడికాలువ,ఎల్.ఎల్.సి.
అండర్ గ్రౌండ్ పైప్ లైన్ సాగునీటి ప్రాజెక్టులకు జీ.వో.లు తీసుకువస్తే అధికారం చేపట్టిన తర్వాత జగన్ పనులు ప్రారంభించకపోవడం రైతు ద్రోహిగా మిగిలిపోయారని ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టుల పనులను ప్రారంభించేలా.. సీఎంపై ఒత్తిడి తెచ్చే దమ్ము, ధైర్యం జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎక్కడిదన్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి జిల్లా రైతులకు అంకితం చేసి కోట్ల కుటుంబం మాట నిలబెట్టుకుంటుందని జిల్లా ప్రజలకు మారో సారి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పసుపు జెండా ఎగురవేయడం ఖాయమన్నారు.