
ముదిరాజ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి
కామారెడ్డి యువతరం ప్రతినిధి;
ముదిరాజులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి యావత్ ముదిరాజులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆదివారం డిమాండ్ చేశారు. ముదిరాజుల మనోభావాలకు బంగం కలిగించిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కి అనర్హుడు అన్నారు. ప్రజా ప్రతినిధిని అని మరిచిపోయి అహంకారంతో పాడి కౌశిక్ ముదిరాజుల కులానికి చెందిన ఓ చానల్ రిపోర్టర్ ను కిడ్నాప్ చేసి గదిలో బంధించి చిత్రహింసలు పెట్టి కొట్టడం కాకుండా నోటికొచ్చిన విధంగా అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు. ముదిరాజులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే భర్తరఫ్ చేయాలని లేదంటే వచ్చే ఎన్నికల్లో ముదిరాజులతో కలిసి కాంగ్రెస్ పార్టీ బిఆర్ ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తుందని హెచ్చరించారు.