
ఎమర్జెన్సీ వ్యతిరేక దినం
కామారెడ్డి యువతరం ప్రతినిధి;
1975 జూన్ 25న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ అరాచకంగా ఎమర్జన్సి విధించిన రోజు అని బిజెపి నాయకులు తెలిపారు. ఆ చీకటి రోజు సంధర్భంగా నాటి పరిస్థితుల విషయంలో బిజెపి జాతీయ పార్టీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల భరత్ మాట్లాడుతూ 1975 లో అలహాబాద్ హైకోర్టు జూన్ 21 న ఇందిరా గాంధీ పై అనర్హత వేటు వేసి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది అని గుర్తు చేశారు. వెంటనే అ తీర్పుని వ్యతిరేకిస్తూ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ క్రూర మైన నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజాస్వామ్య కుని, మానవ హక్కుల ఉల్లంఘన చేసే విధంగా జూన్ 25 న ఎమర్జెన్సీ ప్రకటించి ప్రతిపక్షాల నాయకుల అందరిని ఏళ్ల పాటు జైళ్లలో పెట్టడం జరిగిందన్నారు. పోలీసులచే అరాచక పాలన కొనసాగించి ప్రజలను రోడ్ల పైకి రాకుండా మీడియా వాళ్ళను ఎమర్జెన్సీ పత్రికల్లో చూపించకుండా భయపెట్టడం, బెదిరించడం, వారి ఆఫీస్ ల్లో కరెంటు కట్ చేయడం ఇలాంటివి అనేక చర్యలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ అరాచక పాలన కొనసాగించింది అని తెలిపారు. అప్పటి జనసంఘ్ నాయకులు అద్వానీ, వాజ్ పెయ్, మురార్జీ దేశాయి , జయప్రకాష్ నారాయణ్ ఇలా చాలా మందిని చాలా రోజుల పాటు జైళ్లలో పెట్టింది అన్నారు. దాదాపు ఈ ఎమర్జెన్సీ 1977 మార్చి 21 వరకు కొనసాగింది అని తెలిపారు. ఇట్టి రోజుని ప్రజలుకు గుర్తు చేసేందుకు ప్రజాస్వామ్యన్నీ కాపాడేందుకు అప్పటి నాయకులు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా జూన్ 25 ను ఎమర్జెన్సి వ్యతిరేక దినం గా నిర్వహిస్తుందని అన్నారు.