అభివృద్ధికి చిరునామా కూటమి ప్రభుత్వం

అభివృద్ధికి చిరునామా కూటమి ప్రభుత్వం
వెల్దుర్తి జులై 28 యువతరం న్యూస్:
కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి అని జిల్లా తెదేపా సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు పేర్కొన్నారు. సోమవారం ఆయన వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డి పల్లె గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ కూటం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి డబ్బులు జమ అవుతున్నాయి అన్నారు. దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్న ఘనత తెలుగుదేశం కే దక్కుతుందన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.



