వైసీపీకి గుడ్‌బై….. టీడీపీలో చేరిన 30 కుటుంబాలు


వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన 30 కుటుంబాలు
రేపల్లె జూలై 23 యువతరం న్యూస్:
నగరం మండలం సిరిపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్లపాలెం గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. నగరం మండల యువ నాయకులు లుక్కా గుడారంకయ్య, సిరిపూడి గ్రామ పంచాయతీ ఇంచార్జ్ సమ్మెట శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనగాని శివప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని, ఆ అభివృద్ధిని చూసే ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన కుటుంబాలు టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు, డీలర్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.



