మంగళగిరిలో శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల హర్షాతిరేకాలు
నారా లోకేష్ వచ్చిన తర్వాతే మాకు గుర్తింపు వచ్చింది


శాశ్వత ఇంటి పట్టాలు అందిస్తామనే హామీని నిలబెట్టుకున్నారు
నారా లోకేష్ వచ్చిన తర్వాతే మాకు గుర్తింపు వచ్చింది
ఇంటి పట్టాలపై గతంలో ఎవరూ పట్టించుకోలేదు
మంగళగిరిలో శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల హర్షాతిరేకాలు
మంగళగిరి ప్రతినిధి జులై 22 యువతరం న్యూస్:
అధికారంలోకి వస్తే మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందిస్తామనే హామీని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారని, నారా లోకేష్ వచ్చిన తర్వాతే తమకు గుర్తింపు వచ్చిందని మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరిగిన మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
చల్లా భవాని
సలాం సెంటర్, తాడేపల్లి
మొదట్లో అనుమానం ఉండేది
గత 15 ఏళ్లుగా తాడేపల్లి సలాం సెంటర్ లో నివాసం ఉంటున్నాం. ఎన్నో ఏళ్లుగా శాశ్వత ఇంటి పట్టా కోసం ఎదురుచూస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇంటి పట్టాలు ఇస్తారని ఎంతో ఆశగా ఎదురుచూశాం. మొదట్లో మాకు కొంత అనుమానం ఉండేది. మా ఆకాంక్షలను నారా లోకేష్ గారు నెరవేర్చారు. మాకు నూతన వస్త్రాలు బహూకరించి ఇంటి పట్టా అందించిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
తురకా శివగురవమ్మ
తాడేపల్లి
ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు
గత 20 ఏళ్లుగా ఇంటి పట్టా కోసం ఎదురుచూస్తున్నాం. పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందిస్తామని మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మంగళగిరి నుంచి నారా లోకేష్ గారే మళ్లీ మళ్లీ విజయం సాధించాలని కోరుకుంటున్నాం.
షేక్ మోతి
ఉండవల్లి
మంగళగిరిని అభివృద్ధి చేస్తున్నారు
మొదటి విడతలో మాకు శాశ్వత ఇంటి పట్టా రాలేదు. ఎంతో బాధపడ్డాం. మా కాలనీలో అనేక మందికి అందించారు. వారు ఎంతో ఆనందించారు. రెండో విడతలో మంత్రి నారా లోకేష్ గారు మాకు ఇంటి పట్టా అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇంటి పట్టా కోసం మేం అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. పేదవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నారా లోకేష్ గారు మంగళగిరిని చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రం కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోంది. ఈ సారి నా ఓటు నారా లోకేష్ కే.
ఎన్.హరినాథప్రసాదరావు, ప్రభావతి
పోలకంపాడు, తాడేపల్లి
అందరికీ మేలు చేస్తున్నారు
గత పదేళ్లుగా మేం పోలకంపాడులో నివాసం ఉంటున్నాం. శాశ్వత పట్టా అందించినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. నారా లోకేష్ గారు మాకు ఎంతో మేలు చేశారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. నియోజకవర్గంలో అందరికీ మేలు చేస్తున్నారు. మళ్లీ ఇదే ప్రభుత్వం రావాలి. మాకు ఇంటి పట్టా అందించడంతో పాటు నూతన వస్త్రాలు బహూకరించి, భోజనాలు పెట్టారు.
ఫాతిమున్నీసా
ప్రకాష్ నగర్ క్వారీ
నారా లోకేష్ వచ్చిన తర్వాతే గుర్తింపు వచ్చింది
ఈ రోజు మాకు, మా కుమార్తెకు నారా లోకేష్ శాశ్వత ఇంటి పట్టా అందజేశారు. మాకు ఇప్పటివరకు గుర్తింపు లేదు. నారా లోకేష్ వచ్చిన తర్వాతే గుర్తింపు వచ్చింది. మళ్లీ తండ్రీకొడుకులు చంద్రబాబు , లోకేష్ రావాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చారు. మాకు నూతన వస్త్రాలు బహూకరించి ఇళ్ల పట్టాలు అందించడం పట్ల లోకేష్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
తన్నీరు వెంకటేశ్వరరావు, బసవమ్మ
తాడేపల్లి
గతంలో ఎవరూ పట్టించుకోలేదు
మేం తాడేపల్లి పోలీస్ స్టేషన్ వెనుక గత 40 ఏళ్లుగా ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్నాం. నారా లోకేష్ గారు శాశ్వత పట్టా అందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నారా లోకేష్ గారు అందరికీ మేలు చేస్తున్నారు. వారు మూడు తరాలు సంతోషంగా ఉండాలి. గతంలో ఇళ్ల పట్టాల సమస్యను ఎవరూ పట్టించుకోలేదు. నీరు, కరెంట్ లేక ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మాకు అన్నీ సమకూర్చారు.
మునిపల్లి బుజ్జి, సీత
డ్రైవర్ కాలనీ, ప్రకాష్ నగర్
ఆయన వెంట ఉంటాం, ఆయనకు రుణపడి ఉంటాం
గత 15 ఏళ్లుగా ప్రకాష్ నగర్ లో నివాసం ఉంటున్నాం. నారా లోకేష్ ఎన్నికల ముందు మాట ఇచ్చారు. నిలబెట్టుకున్నారు. మేం ఆయన వెంట ఉంటాం, ఆయనకు రుణపడి ఉంటాం. ఇంటికి పెద్ద కొడుకులా ఆదర్శంగా నిలిచారు.
బాయిన సాయి కుమారి
నులకపేట
ఎన్నో ఇబ్బందులు పడ్డాం
నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత 40 ఏళ్లుగా నులకపేటలో నివాసం ఉంటున్నాం. ఇంటి పట్టా లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నారా లోకేష్ గారు శాశ్వత ఇంటి పట్టా అందించడం పట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
షేక్ గౌసియా
తాడేపల్లి
సొంత ఇంట్లో ఉంటున్నామనే భావన ఇప్పుడు కలిగింది
నేను తాడేపల్లిలో గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నా. అప్పటి నుంచి మాకు ఇంటి పట్టా లేదు. ఎంతోమంది వచ్చారు, పోయారు. మాకు ఇంటి పట్టా లేదు, మాకు గుర్తింపు లేదు. ఇప్పుడు నారా లోకేష్ వచ్చి మాకు గుర్తింపు ఇచ్చారు. సొంత ఇంట్లో ఉంటున్నామనే భావన ఇప్పుడు కలిగింది. గతంలో ఇల్లు నిర్మించుకున్నా, ఎవరు వచ్చి కూలగొడతారోననే భయంతో బతికాం. లోకేష్ ఇచ్చిన మాట నెరవేర్చారు. ప్రభుత్వంలో లేనప్పుడు కూడా మాట ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు శాశ్వత ఇంటి పట్టా ఇవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం.
షేక్ ఆయేషా బేగం, షేక్ బాజి బాబు
పద్మశాలీ బజారు, తాడేపల్లి
మళ్లీ మళ్లీ నారా లోకేష్ రావాలి
వివాహం అయినప్పటి నుంచి తాడేపల్లిలోని 15 వ వార్డులో గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం. ఇంటి పట్టా ఇస్తామని గతంలో అనేక మంది చెప్పినా నెరవేర్చలేదు. ఎన్నికల సమయంలో నారా లోకేష్ శాశ్వత ఇంటి పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. మంగళగిరి అభివృద్ధి చెందాలంటే నారా లోకేష్ గారు మళ్లీ రావాలి. రాష్ట్రంలో కూడా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. తల్లికి వందనం పథకం ఇస్తున్నారు.



