మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి టిడ్కో కాలనీలో 700 భారీ మొక్కలు
రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు విశిష్ట కార్యక్రమం


మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి టిడ్కో కాలనీలో 700 భారీ మొక్కలు
రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు విశిష్ట కార్యక్రమం
మంగళగిరి ప్రతినిధి జులై 22 యువతరం న్యూస్:
మంగళగిరి పీఎంఏవై ఎన్టీఆర్ నగర్ టిడ్కో గృహ సముదాయంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే శ్రీ నారా లోకేష్ గారి చొరవతో 700 మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఒక్కో మొక్క సుమారు 15 అడుగుల నుండి 20 అడుగుల ఎత్తు కలిగి ఉండటం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా–3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ ఉదయ్ సుధీర్ పీలాని పిలుపు మేరకు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పచ్చదనాన్ని పెంపొందించడం, కాలుష్యాన్ని తగ్గించడం, భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా–3150 జిల్లా చైర్మన్ (సర్వీస్ ప్రాజెక్ట్స్) PDG డా. ఏకేఎస్ రవి వడ్లమాని హాజరై మొక్కలు నాటారు. గౌరవ అతిథులుగా రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్.కె. అలీం బాషా, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసులు ఎం.కె.వి., జిల్లా చైర్మన్ (క్లబ్ అడ్మినిస్ట్రేషన్) PDG అన్నె రత్న ప్రభాకర్, అసిస్టెంట్ గవర్నర్ రోటేరియన్ గాజుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు రోటేరియన్ పరేపల్లి నిరంజన్ గుప్తా, కార్యదర్శి రోటేరియన్ వడ్లమూడి శ్రీనివాసరావు, కోశాధికారి రోటేరియన్ చానుమోలు గోపాలరావు, డైరెక్టర్ (సర్వీస్ ప్రాజెక్ట్స్) రోటేరియన్ బత్తు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. రోటరీ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రజలు, టిడ్కో నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మంగళగిరిలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో పచ్చదనం పట్ల అవగాహన పెంచుతున్నాయని తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్కను నాటి దానిని పరిరక్షిస్తే మంగళగిరిని ఆదర్శవంతమైన హరిత నగరంగా తీర్చిదిద్దవచ్చని పిలుపునిచ్చారు.



