పేద మహిళ నూతన గృహం ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ గుప్తా


పేద మహిళ నూతన గృహం ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ గుప్తా
కర్నూలు ప్రతినిధి జులై 14 యువతరం న్యూస్:
కర్నూలు నగరంలోని 11వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఖాన్ బ్రదర్స్ నిరుపేద మహిళల కోసం గృహాలు నిర్మించారు. రూ.36 లక్షల సొంత డబ్బుతో పార్వతమ్మ అనే మహిళతో పాటు రాజు అనే వ్యక్తికి నూతన గృహాలు నిర్మించారు. అనాధలైన వీరిద్దరి ఇల్లు పూర్తిగా శిథిలమైపోయిన నేపథ్యంలో ఖాన్ బ్రదర్స్ ముందుకొచ్చి వీరి కోసం ఇల్లు కట్టించారు. ఈ రెండు గృహాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ నాయకులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. వీరిని చూసి మరికొందరు స్పూర్తి పొందాలని ఆయన సూచించారు. తమ కష్టాలు తెలుసుకొని సహాయం చేసిన ఖాన్ బ్రదర్స్ మేలు మర్చిపోలేమని మహిళ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మెహబూబ్ ఖాన్ మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్ సేవా మార్గంలో తాము నడుస్తున్నట్లు చెప్పారు.



