సంక్షేమ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి
మంత్రి అనగాని సత్యప్రసాద్


సంక్షేమ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రేపల్లె, జూన్ 18 యువతరం న్యూస్:
రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రేపల్లె మండల రైతులకు వ్యవసాయ పనుల్లో చేయూతనందించే మరో ముఖ్యమైన ముందడుగు పడింది. రేపల్లె మహిళా రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ఆధ్వర్యంలో, రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) సహకారంతో రైతులకు తక్కువ అద్దెకు దుక్కులు దున్నేందుకు ఒక నూతన ట్రాక్టర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ట్రాక్టర్‌ను రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చిన్న, సన్నకారు రైతులకు తక్కువ వ్యయంతో వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రావడం వల్ల సాగు ఖర్చులు తగ్గి, వ్యవసాయం మరింత లాభదాయకంగా మారుతుందని అన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
రేపల్లె మహిళా రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ ట్రాక్టర్ ద్వారా మండలంలోని రైతులకు తక్కువ అద్దెతో దుక్కులు దున్నే సౌకర్యం కల్పిస్తామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సెర్ఫ్ అధికారులు, సంఘం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



