ANDHRA PRADESHOFFICIALSTATE NEWS

పి-4 లో బంగారు కుటుంబాల దత్తత స్వచ్ఛందంగా జరగాలి

చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్

పి-4 లో బంగారు కుటుంబాల దత్తత స్వచ్ఛందంగా జరగాలి

చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్

కర్నూలు కలెక్టరేట్ ఆగస్టు 08 యువతరం న్యూస్:

పి-4 లో భాగంగా బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమం స్వచ్ఛందంగా జరిగేలాగా చర్యలు తీసుకొని త్వరగా పూర్తి చేయాలని చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ పేర్కొన్నారు.
గురువారం చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ విజయవాడ నుండి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వర్ణ ఆంధ్ర పి-4 ఫౌండేషన్ లో దత్తత కార్యక్రమాలు ఎటువంటి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా దత్తత తీసుకునే చర్యలు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సానుకూల ప్రజా దృక్పథం, ఏజెంట్ కోసం డాక్యుమెంట్ అప్‌లోడ్, ఎమ్మెస్ ఎంఈ పార్కులు, మేజర్ ప్రాజెక్టులకు భూమి ఏర్పాటు, జిల్లాలలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టులు, అన్నదాత సుఖీభవ, యూరియా సరఫరా మొదలగు విషయాలపై రివ్యూ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో జె సి డా.బి.నవ్య, డిఆర్ఓ వెంకటనారారాయణమ్మ, సిపిఓ హిమప్రభాకర్ రాజు, జడ్పిసిఈఓ నాసర రెడ్డి, అగ్రికల్చర్ జెడి వరలక్ష్మి, కర్నూలు మున్సిపల్ కామీషనర్ విశ్వనాథ్, డిపిఓ భాస్కర్, జెడ్ ఎం మధుసూదన్ రెడ్డి, అడిషనల్ డి ఎం హెచ్ ఓ భాస్కర్, డిఆర్డిఎ పిడి రమణ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి, ట్రాన్సకో ఈ ఈ ఓబులేష్, దేవాదాయ ఏ సి సుధాకర్ రెడ్డి, డిఎం మార్కఫెడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!