ANDHRA PRADESHCRIME NEWSOFFICIAL

శభాష్ పోలీస్ సార్

శభాష్ పోలీస్ సార్

24 గంటలలో ఛేదించిన బుక్కరాయసముద్రం పోలీసులు

పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపిన అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు

బుక్కరాయసముద్రం ఆగస్టు 07 యువతరం న్యూస్:

బుక్కరాయసముద్రం మండలంలోని 6 వ తారీకు తెల్లవారుజామున చేపల కాలనీలోని ఓ ఇంట్లో చోరీ కేసు వివరాలు వెల్లడించిన అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదీ అయిన పాముల తిప్పక్క, చేపల కాలనీ లో ఉన్న ఇంటిలో తెల్లవారుజమున 03.00 గంటల సమయము లో కూరగాయల వ్యాపారం నిమిత్తం ఇంటికి తాళం వేసుకొని వెల్లిపోయి తిరిగి ఉదయం 07.00 గంటలకు తన ఇంటికి వచ్చి చూసుకొనగా ఇంటి యెక్క తాళము పగుల గొట్టి ఇంటిలోనికి చొరబడి బీరువా ఓపెన్ చేసి బీరువలో ఉన్న 3.30 వేలు రూపాయల నగదు మరియు సుమారు 6 తులముల బంగారు ఆభరణాలు చోరీ అయినాయని గుర్తించి బుక్కరాయసముద్రం పోలీసు వారి కి ఫిర్యాదు చేయగా జిల్లా ఎస్పి జగదీష్, ఐపీయస్, అనంతపురము రూరల్ డియస్పీ టి.వెంకటేశులు వారి ఆదేశాలమేరకు క్లూస్ టీమ్ ను రప్పించి నేరస్తాలమును పరిశిలించి అనుమానితులైన వ్యక్తులను విచారించుటకు బుక్కరాయసముద్రం సీఐ కే.పుల్లయ్య, యస్ ఐ వి. రామ్ ప్రసాద్, పి యస్ ఐ కె.కల్యాణ్ మరియు వారి సిబ్బంది తో కలసి అనుమానితులైన గాజుల ఇంద్రసేనా రెడ్డి, గాజుల శశి కుమార్ రెడ్డి, బద్రి అయిన వీరిని వైస్సార్ జంక్షన్, ముసలమ్మ కట్ట వద్ద విచారించి వారి వద్ద ఉన్న చోరీ సొత్తును అనగా 6. తులముల బంగారు మరియు 3.30, నగదు ను వారి వద్ద నుండి స్వాదినం చేసుకొని వారిని అరెస్టు చేయడమైనది. నేరం జరిగిన 24 గంటల లో కేసు ఛేదించిన బుక్కరాయసముద్రం సీఐ కే. పుల్లయ్య, మరియు యస్ ఐ యస్ ఐ వి. రామ్ ప్రసాద్, ప్సీ పి యస్ ఐ కే.కల్యాణ్,మరియు వారి సిబ్బంది ఎయస్ ఐ ఎం. రామామోహన్ రెడ్డి, పీసీయస్ వారదప్ప, శ్రీనివాసులు, అలీ అక్బర్, గోపాల్ యాదవ్, డబ్ల్యూ పీసీ స్వప్న మరియు ఎచ్ జి శ్రీకాంత్ లను ఎస్పి వారు అభినందిచ్చినారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!