ఎమ్మెల్యే గారు వెల్దుర్తి ఇరుకు రోడ్లను జర చూడండి

ఎమ్మెల్యే గారు వెల్దుర్తి ఇరుకు రోడ్లను జర చూడండి
వెల్దుర్తి ఫిబ్రవరి 28 యువతరం న్యూస్:
ఎమ్మెల్యే గారు వెల్దుర్తి ఇరుకు రోడ్లను జర చూడండి అంటూ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు మారుతున్న వెల్దుర్తి తలరాత మారడం లేదని వెల్దుర్తి మండల ప్రజలు పేర్కొంటున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వెల్దుర్తి లో ఇరుకు రోడ్లను వెడల్పు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు తెలుపుతున్నారు. మామూలు సమయంలోనే ఎదురెదురుగా రెండు వాహనాలు ఎదురవుతే మూడవ వాహనం వెళ్లడానికి అష్ట కష్టాలు పడవలసి వస్తుంది. ఆ సమయంలో పాదాచారులకు, ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం మరియు పండుగ వేళలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. సంబంధిత పోలీస్ అధికారులు ట్రాఫిక్ ని ఎంత నియంత్రించిన రోడ్లు ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య తీరడం లేదని మండల ప్రజలు పేర్కొంటున్నారు. మండల కేంద్రమైన వెల్దుర్తి లో ట్రాఫిక్ సమస్య తీరాలంటే రోడ్లను వెడల్పు చేయవలసిందేనని వెల్దుర్తి మండల ప్రజలు తెలుపుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు జర రోడ్ల వెడల్పు మీద దృష్టి సారించాలని వెల్దుర్తి మండల ప్రజలు వేడుకుంటున్నారు.