అక్రిడిటేషన్ లేదా బయటికి వెళ్ళిపో, విలేకరులకు అధికారి హుకుం

మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మీడియా అక్రిడిటేషన్ఉంటే కూర్చోండి లేదంటే బయటికి వెళ్ళండి
అంటూ హుకుం జారీ చేసిన డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్
డోన్ ప్రతినిధి ఫిబ్రవరి 24 యువతరం న్యూస్:
డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు సోమవారం కమిషనర్ ప్రసాద్ గౌడ్,చైర్మన్ సప్తశైల రాజేష్ ల అధ్యక్షతన మున్సిపల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ మున్సిపల్ కౌన్సిల్ డోన్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ నెంబర్లు హాజరయ్యారు.
డోన్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజల యొక్క సమస్యలను తీర్చుటకై ఏర్పాటు చేసే బడ్జెట్ ఎంత కౌన్సిలర్లు వారి వార్డుల యొక్క సమస్యలను తీర్చుటకు ఎంత బడ్జెట్ అడుగుతారు అని తెలుసుకొనుటకు
కొందరు మీడియా సోదరులు హాజరయ్యారు.
కానీ ఈ విషయాలు బయటికి వెళ్లకూడదని సమావేశం హాల్ కి తలుపులు వేసి గొల్లంపెట్టారు. ఏఉద్దేశంతో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఈ సమావేశానికి అక్రిడేషన్ ఉన్న మీడియా సోదరులు మాత్రమే హాజరై లోపల ఉండాలని అక్రిడేషన్ లేని మీడియా మిత్రులు బయటకి వెళ్లాలని ఏమైనా సమాచారం ఉంటే మేము బయటకు వచ్చి చెబుతామని తెలియజేయడం ప్రభుత్వ కార్యాలయాలలో మీడియా అక్రిడేషన్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది అక్రిడేషన్ లేని విలేకరులకు మీడియా వృత్తిలో కొనసాగకూడదు అనేలా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తుండడం గమనార్హం.
నిరంతరం ప్రజలకు అధికారులకు వారి హద్దుల పనిచేసే విలేకరులకు కనీస గౌరవమైన ఇవ్వాలని కొందరు మేధావులు వాపోతున్నారు.