ANDHRA PRADESHPROBLEMS

రాగిమాన్ దొడ్డి గ్రామంలో తాగునీటి కష్టాలు

రాగిమాన్ దొడ్డి గ్రామంలో తాగునీటి కష్టాలు

మొత్తం ఆరు కుళాయిలు, రెండింటిలో నామమాత్రపు నీరు

మిగతా నాలుగు కులాయిలకు నీటి సరఫరా బంద్

కొత్త నీటి ట్యాంక్ ద్వారా వెంటనే నీటి సరఫరా చేయాలి

అధికారులు స్పందించి మాకు త్రాగడానికి గుక్కెడు నీరు వదలండి

పెద్దకడబూరు జూన్ 17 యువతరం న్యూస్:

పెద్దకడబూరు మండలం రాగిమాన్ దొడ్డి గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. గ్రామంలోని ఆరు కుళాయిలలో రెండింటిలో మాత్రమే కొద్దిగా నీరు వస్తుండగా, మిగిలిన నాలుగు కుళాయిలలో నీటి సరఫరా నిలిచిపోయింది. కొత్తగా ఏర్పాటు చేసిన కుళాయిలకు కూడా నీటిని విడుదల చేయలేదు. గ్రామానికి ఉన్న ఒకే తాగునీటి బోరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని గ్రామస్తులు ఊరి బయట ఉన్న చేతి పంపుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంగళవారం
పత్రిక విలేకరులతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నీటి ట్యాంక్ ద్వారా వెంటనే నీటి సరఫరా ప్రారంభించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను కోరారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!