తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి చెంతకు కోడుమూరు నుంచి మొదలైన సైకిల్ యాత్ర

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి చెంతకు కోడుమూరు నుంచి మొదలైన సైకిల్ యాత్ర
కోడుమూరు జూన్ 17 యువతరం న్యూస్:
కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రతి ఇల్లు కొంగుబంగారంగా కొలుస్తున్న తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి కోడుమూరు నుంచి దాదాపు 20 మంది భక్తులు సైకిల్ తొక్కుతూ మంగళవారం నాడు వెంకటేశ్వరుడి దర్శనార్థమై బయలుదేరారు. సైకిల్ యాత్ర చేస్తున్న భక్తులకు కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు మేళ తాళాలతో బయలుదేరి ప్రారంభించారు. కోడుమూరు నుంచి తిరుపతికి సైకిల్ని తొక్కుతూ దాదాపు నాలుగు రోజులకు చేరుకుంటామని భక్తులు తెలిపారు. దైవ దర్శనార్థం కొంతమంది బస్సుల ద్వారా వెళ్లి దర్శించుకుంటారు. మరి కొంతమంది పాదయాత్రగా వెళ్లి దర్శించుకుంటారు. కానీ కోడుమూరు పట్టణం నుంచి సైకిల్ యాత్రగా వెళ్లి తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకోవడం ఇక్కడ విశేషం. గత 20 సంవత్సరాలు క్రితం బోయశేషన్న , బచ్చంగిడ్డయ్య , పెదబాబు, వీరు ముగ్గురు కలసి ఈ సైకిల్ యాత్ర మొదలుపెట్టగా ఇప్పటికీ ప్రతి సంవత్సరం విద్యార్థులు కోడుమూరు నుంచి సైకిల్ యాత్రగా వెళుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకుని వస్తూ తమ భక్తి భావాన్ని చాటుతున్నారు.



