ANDHRA PRADESHCRIME NEWSOFFICIALSTATE NEWS

జొన్నగిరి గోల్డ్ మైన్స్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్

జొన్నగిరి గోల్డ్ మైన్స్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్

తుగ్గలి జూన్ 17 యువతరం న్యూస్:

మండల పరిధిలోని జొన్నగిరి గోల్డ్ మైన్స్‌కు ఈ నెల 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మంగళవారం పరిశీలించారు.
జొన్నగిరి గోల్డ్ మైన్స్‌కు చేరుకున్న డీఐజీకి డీఎస్పీ వెంకటరామయ్య, రూరల్ సీఐ పులి శేఖర్, జొన్నగిరి ఎస్సై ఎన్.సి. మల్లికార్జున స్వాగతం పలికారు. అనంతరం మైన్స్ జనరల్ మేనేజర్ బాలాజీ, పీఆర్ఓ రాజేష్‌లు గోల్డ్ మైన్స్ కార్యకలాపాలు, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను డీఐజీకి వివరించారు.
ఈ సందర్భంగా డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్, సభా ప్రాంగణం వద్ద భద్రతా చర్యలను సమన్వయంతో నిర్వహించాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, మైన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!